నిజామాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం స్థానిక సారంగపూర్‌లోని నిజామాబాద్ జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జే విక్రమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు పరిశీలించారు, రిమాండ్ ఖైదీలను వివరాలను అడిగి తెలుసుకొని వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ జైలు శుభ్రంగా ఉంచాలని ఖైదీలకు అవసరమైన ములాకాత్ ఏర్పాటు చేయాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. తనిఖీల్లో సేవా సంస్థ న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, టి గోపాల్, సంస్థ సిబ్బంది నాగేందర్, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.