నిజామాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లలో వినాయక చవితి సందర్భంగా ఎవ్వరైనా కమ్యూనల్ టెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్ కమీషనరేటు యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకొనబడుతాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా హెచ్చరించారు.
తెలంగాణ గెజిట్ పార్ట్-4 ఎక్స్‌ట్రార్డినరీ పబ్లిష్‌డ్ బై అధారిటి ఆన్ 8-10-2016 జి.ఓ నెంబర్ 163 అండర్ సెక్షన్ 22(1) (ఎ) టూ (ఎఫ్) మరియు 22 ఎ మరియు బి ఆఫ్ హైదరాబాద్ సిటి పోలీస్ యాక్టు 1348 ఫస్లీ ( నెంబర్: 1ఎక్స్) ప్రకారంగా శిక్షార్హులవుతారని, ఎవరైనా కత్తులు, మారణాయుదాలు, కర్రలు లేదా ఎలాంటివైన ఉపయోగించి నేరాలు చేయడానికి ప్రయత్నిస్తే వారిపై ఇండియన్ ఆమ్స్ యాక్టు మరియు ఐ.పి.సి సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఎవరైనా కమ్యూనల్ టెన్షన్స్ సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిపై రౌడీ షీటులు తెరవబడుతాయని, గతంలో రౌడీ షీటు తెరవబడిన వారిపై పోలీస్ నిఘా పటిష్ట పరచడం జరిగిందన్నారు. వారి ప్రతి కదలికలపై సంబంధిత పోలీస్ సిబ్బంది ద్వారా నిఘా ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు చేసేవారిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు.
వాట్సప్ గ్రూప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాలపై ఎల్లప్పుడు పోలీస్ సైబర్ క్రైమ్ సెల్ గట్టి నిఘా ఏర్పర్చారని, మత విద్వేషాలను సృష్టించే మెసేజ్‌లను ఎవ్వరైన పంపించినా, వాటిని సృష్టించిన వారిపైన పోలీస్ కమీషనరేటు యాక్టు ప్రకారంగా కఠినమైన చర్యలు తీనుకోబడతాయన్నారు. ఇతరులకు ఇబ్బందికల్గించే విధంగా ఎవ్వరు కూడా సోషల్ మీడియాను తప్పుడు పనులకు ఉపయోగించరాదని హెచ్చరించారు.
ఇప్పటి వరకు కమ్యూనల్ టెన్షన్స్ సృస్టించిన వారి పేర్లు పోలీస్ శాఖ వద్ద ఉన్నాయని, వారిపై ఎల్పప్పుడు నిఘా ఏర్పాటుచేశామని, ఇంకా ఎవ్వరైన కమ్యూనల్ టెన్షన్స్ సృష్టించడానికి ప్రయత్నించిన, ప్రోత్సహించిన వారి సమాచారం తెలుపవలసిన ఫోన్ నెంబర్లు ఈ దిగువ ఉన్నాయని, ఇట్టి సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందన్నారు.
ఎక్కడ కూడా డి.జే అనుమతి లేదని, సుప్రిమ్‌కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారంగా సాదరంణంగా మాత్రమే సౌండ్ సిస్టమ్ వాడుకోవాలని, అలా కాకుండా ఎవరైనా డి.జే సౌండ్ సిస్టమ్ వాడినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎందుకంటే గణేష్ మండపం చుట్టు ప్రక్కల లేదా సంబంధిత కాలని ప్రాంతాలలో వయసు పై బడిన వారు, విధ్యార్థులు, అనారోగ్యంతో ఉన్న వారు ఉంటారు కావున వారిని దృష్టిలో ఉంచుకొని డి.జే వాడకం నిషేధించడం జరిగిందన్నారు.
ప్రజలందకి వినాయక చవితి శుభాకాంక్షలు, ప్రతీ చోట విగ్రహాలు ఏర్పాటు చేశారని, ప్రతి విగ్రహాం వద్ద మండపాల నిర్వాహకులు ఎల్లప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. ప్రజలకోసం వినాయక చవితి సందర్బంగా పోలీస్ శాఖాపరంగా హెల్ప్‌లైన్ నెంబర్ 94906-18000 ను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.