గాంధారి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం నేరల్ గ్రామానికి మంజురైన పాలీహౌస్‌లను మంగళవారం ఉద్యానవన జిల్లాధికారి సంజీవ్ రావు పరిశీలించారు. ఉద్యానవన శాఖ ద్వారా నేరల్ గ్రామానికి 5 ఫాలిహౌజ్ మంజూరు కాగా వాటిని పరిశీలించి సలహాలు సూచనలు చేశారు.
గ్రామంలోని సాయిలు, జాదవ్ పూలబాయి, శ్రవణ్, గోపాల్, దేవీసింగ్‌లకు చెందిన ఫాలిహౌజ్‌లలో పండిస్తున్న చామంతి తోటలను పరిశీలించారు. ఒక ఎకరం ఫాలిహౌజ్‌లో 55 వేల నుండి లక్ష మొక్కలు నాటటం జరిగిందని సంజీవ్ రావు తెలిపారు. చామంతి మొక్కలను జూన్ -జులై లలో వేస్తె నవంబర్ -డిసెంబర్ నాటికీ పూతకు వస్తాయని అన్నారు.
రైతులకు తగు సలహాలు సూచనలు చేశారు. మొక్కలు నాటిన 4 వారాలకు తలలు తుంచి వేయాలని తెలిపారు. చామంతిలలో ముఖ్యంగా వేరుకుళ్లు తెగుళ్లును గుర్తించామని, వాటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలనీ సూచించారు. కార్యక్రమంలో మండల ఉద్యానవన శాఖాధికారి లోకేష్, రైతులు పాల్గొన్నారు.