కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్‌ఎం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, కామారెడ్డి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.