అధికారులు స్కూల్స్‌ తనిఖీ చెయ్యాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూల్స్‌ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాఠశాలలు తనిఖీ, గణేష్‌ నిమజ్జనం, అధిక వర్షాలు, హరితహారం, ఫారెస్ట్‌పై సమీక్షించారు.

జిల్లా అధికారులు, డివిజన్‌ మండల స్థాయి అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఎంఈఓలు, స్కూల్‌ హెడ్‌ మాస్టర్లతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రేపటి నుండి వ్యాక్సిన్‌ వేగవంతం చెయ్యాలని, ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో ఒక ప్లాన్‌ ప్రకారం పోవాలని, అప్పుడే థర్డ్‌వేవ్‌ రాకుండా అడ్డుకుంటామని, కావున దీన్ని చాలెంజ్‌గా తీసుకొని పని చెయ్యాలని, 20 రోజులలోనే పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిపి మున్సిపాలిటీలో 100 శాతం పూర్తి చేసి అక్కడ పండుగ లాగా చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్తి అయిన దగ్గర ఒక స్టికర్‌ వేసి రావాలని, మెడికల్‌ అధికారులు, ఎంపిడిఓ, మున్సిపల్‌ కమీషనర్‌లు గ్రామంలో సర్పంచ్‌, కౌన్సిలర్‌, ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు తీసుకొని వ్యాక్సిన్‌ జిల్లాలో తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా మెడికల్‌ అధికారులు ఒక సింగిల్‌ డోస్‌ వేస్ట్‌ కాకుండా పని చెయ్యాలని, జిల్లాలో ప్రతి డోర్‌కు వెళ్ళండని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ దృష్టిలో పెట్టుకొని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నిబంధనలు పాటించే విధంగా చూడాలని, ఏ విద్యార్థికి ఏ పాఠశాలలో కూడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌కు వెంటనే వ్యాక్సిన్‌ వేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శానిటేషన్‌, డ్రిరకింగ్‌ వాటర్‌, భోజనాలు, తరగతులు, టాయిలెట్స్‌ , విద్యుత్‌ ప్రతి దగ్గర నిబంధనలు పాటించాలని, మండల, స్పెషల్‌అధికారులు, క్లస్టర్‌ అధికారులు స్కూల్‌లు తనిఖీ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కావున టీచర్‌లు పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పరిశీలన చేసి వారిని తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి టీచర్‌, పిల్లలు తప్పక మాస్క్‌ పెట్టాలని మాస్క్‌ లేకుండా ఎవ్వరూ కనిపించ వద్దని టీచర్‌లు సిలబస్‌, టీచింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ చెయ్యాలని ఆదేశించారు.

టాయిలెట్స్‌, విద్యుత్తు, డ్రిరకింగ్‌ వాటర్‌, శనిటైజర్‌ అందుబాటులో ఉండేవిధంగా సరిగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని స్కూల్స్‌లో శానిటైజ్‌ చేయించాలని, స్కూల్‌ ఆవరణంలో చెత్త, ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని, క్లాస్‌ రూమ్‌లో టీచర్‌, ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించి రావాలని, ప్రతి క్లాస్‌ టీచర్‌ క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులు మాస్కు ధరించి సోషల్‌ డిస్టెన్స్‌లో కూర్చునే విధంగా హెడ్‌ మాస్టర్లు ఆదేశించారు. టీచర్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పెషల్‌ క్లాసెస్‌ నిర్వహించాలని, ఒక నెల పాటు అన్ని స్కూళ్లు, కాలేజీలో బోధించాలని సూచించారు.

ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున అనుగుణంగా ఏ విద్యార్థి కూడా అనారోగ్యం పాలు కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంపీడీవోలు, తాహసిల్దార్‌లు, ఎంపిఓలు క్లస్టర్‌గా ఏర్పడి ప్రతి స్కూలు పరిశీలించాలని, ప్రతి గ్రామంలో శనిటైజ్‌ చేసుకోవాలని సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నవి కావున ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్‌లో ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. టీచర్‌లు ఒక వేళ శ్రద్ద పెట్టకపోతే వారిపై చర్యలు వుంటాయని అధికారులను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలో సెప్టెంబర్‌ 19 నిర్వహిస్తున్న గణేష్‌ నిమజ్జనంపై శ్రద్ద తీసుకోవాలని స్పెషల్‌ నోడల్‌ ఆఫీసర్స్‌ నిమజ్జనం ఏర్పాట్లు, రోడ్డు రూట్‌ వారిగా విద్యుత్‌ శాఖ ప్రాపర్‌గా చూడాలని, నిమజ్జనం జరిగే దారుల్లో రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో గణేశ్‌ ఉత్సవ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అధికారులు నిమజ్జనం ఏరియాను పరిశీలించాలని, క్రేన్స్‌ పెంచాలని, మ్యాన్‌ పవర్‌ ఎంత అవసరమో అంత కన్నా ఎక్కువ పెట్టాలని అధికారులను ఆదేశించారు. హరితహారం టార్గెట్‌ పూర్తి కావాలని పూర్తయిన చోట జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. మొక్కల ప్రొటెక్షన్‌పై 100 శాతం పెట్టిన మొక్కలు బ్రతకాలన్నారు. గ్రామ పంచాయతీ లేబర్‌ తౌరనౌట్‌ చాలా తక్కువగా ఉన్నది కావున పెంచాలని అధికారులను ఆదేశించారు. 25 శాతం తక్కువ కాకుండా ఉండాలని చాలా మండలంలోని పెంచాలని ఎంపిడిఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌ నాయక్‌, డిఈఓ దుర్గ ప్రసాద్‌, జయసుధ, డిపిఓ, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »