నిజామాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వ్యతిరేక 3 చట్టాల రద్దుకై ఈనెల 27న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా భాద్యులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు చట్టాలను విద్యుత్ సవరణలను రద్దు చేయాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా చట్టం చేయాలన్నారు.
మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలను విడనాడలన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం మానుకోవాలన్నారు. స్వామినాథన్ సిఫార్సులను వ్యవసాయ రంగంలో అమలు చేయాలన్నారు. ఏఐకెఎస్‌సిసి జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈనెల 27న జరిగే భారత్ బందును జయప్రదం చేయాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీల, రైతు సంఘాల భాద్యులు వనమాల కృష్ణ, రమేష్ బాబు, కంజర భూమన్న, పెద్ది వెంకట్రాములు, భాస్కర్, ఆకుల పాపన్న, రామకృష్ణ, గంగాధర్, వెంకటేష్, రాజన్న, సుధాకర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.