కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోకి బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించింది. మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు.
బుధవారం జిల్లాలో 14.3 కిలో మీటర్లు జిల్లాలో పాదయాత్ర ఉండగా రాత్రికి నాగిరెడ్డిపేట్ మండలం బంజారా తండాలో బస చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా మొత్తం 86 కిలోమీటర్లు పాదయాత్ర సాగనుంది. ఈనెల 17న నిర్మల్ సభ నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఉంటుంది.