ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

గాంధారి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకుల నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందినా, తెలంగాణకు నిరంకుశ నిజాం కబంద హస్తాలలో ఉందని అన్నారు.

భారతదేశం మొత్తం ఆగష్టు 15 న జాతీయ జెండా ఎగురవేసినా, తెలంగాణ ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్‌ 17 న నిజాం కబంద హస్తాలనుండి విమోచనం కలిగిందని అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సారథ్యంలో సైనిక్‌ చర్య తర్వాత తెలంగాణకు విముక్తి కలిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయిబాబా, మచ్చర్ల శ్రీకాంత్‌, కట్రోత్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »