కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ సేవల్లో కలికితురాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్‌ అసోసియేషన్‌లో లైన్స్‌ క్లబ్‌ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్‌ క్యాంపు నిర్వహించారు.

ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్‌ సిబ్బందికి షుగర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 90 మందికి టెస్ట్లు నిర్వహించగా 25 మందికి షుగర్‌ తేలిందని లైన్స్‌ క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షులు కందుకూరి సునీల్‌ కుమార్‌ తెలిపారు. కామారెడ్డి కోర్టులో న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి టెస్టులు నిర్వహించడం పట్ల కోర్టు వర్గాలు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గజ్జెల బిక్షపతి లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో లైన్స్‌ క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షులు కందుకూరు సునీల్‌ కుమార్‌, కార్యదర్శి తాళ్లపల్లి దేవరాజ్‌ గౌడ్‌, ప్రతినిధులు నిమ్మ దామోదర్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి, రఘు కుమార్‌, గంగాధర్‌, రాజన్న, వెంకన్న, మహేష్‌, శ్యామ్‌ గోపాల్‌, కామిశెట్టి, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గంగాధర్‌, జగన్నాథం శంకర్‌ రెడ్డి, జుడిషియల్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »