బోధన్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ దేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడ్లను తెచ్చారని వీటి రద్దుకై ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 20 తేదీన లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారని, శనివారం బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులతో జరిగిన సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీఐ గ్రౌండ్ నుంచి లేబర్ ఆఫీస్ వరకు ర్యాలీ, లేబర్ ఆఫీస్ ముందు జరిగే ఆందోళన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ కార్మికులు నారాయణ, గోపాల్, పోశెట్టి, ఎం.సాయులు, నవాబ్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.