కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేవిధంగా బూత్ లెవల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఓటేద్దాం రండి అనే పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. శిథిలమైన భవనాలలో పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిని తక్షణమే మార్చాలని కోరారు. మృతిచెందిన, వలస వెళ్ళిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని పేర్కొన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయంలో ఉన్న ఓటర్ హెల్ప్ లైన్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఫామ్.6,8 పెండిరగ్ లేకుండా చూడాలని సూచించారు. గరుడ యాప్‌లో బూత్ లెవల్ అధికారులు ఓటర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఎన్నికల సూపరింటెండెంట్ వరప్రసాద్, ఆర్‌డివోలు శీను, రాజా గౌడ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.