ముప్కాల్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మంత్రివర్యులు, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేశారు.
ముప్కాల్ ఎంపిపి సామ పద్మా వెంకట్ రెడ్డి ఈ సందర్బంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి వరద కాలువకు 2 వేల క్యూసెక్కుల నీటిని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రాజెక్టు అధికారులతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.