జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్, మునిపల్లి, లక్కోర, జక్రాన్‌పల్లి గ్రామాలలో జూన్, జూలై, ఆగస్టు నెలలో పగటి పూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్రికి చెందిన ఇద్దరు నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కి పంపిననట్టు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డిచ్పల్లి సిఐపి రఘునాథ్, నిజామాబాద్, ఏసిపి వెంకటేశ్వర్లు అభినందించారు.