డిచ్పల్లి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయశాస్త్ర విభాగం ఆద్వర్యంలో సోమవారం మూట్ కోర్ట్ ట్రయల్స్ (నమూనా న్యాయస్థానం) కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు విభాగ అద్యక్షులు డాక్టర్ బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్ఎల్బి ఆరవ సెమిస్టర్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన నమూనా న్యాయస్థానం కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆమె వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ స్రవంతి తెలిపారు. సీనియర్ న్యాయవాది రామాగౌడ్ నమూనా న్యాయస్థానం న్యాయమూర్తిగా వ్యవహరించారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.