కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం 765డి మెదక్ నుంచి రుద్రూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, రెవిన్యూ, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.
అవసరమైన చోట సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, బాన్సువాడ ఆర్‌డిఓ రాజా గౌడ్, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బి, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో, సర్వే ల్యాండ్ అధికారులు పాల్గొన్నారు.