కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలో 1800 మంది లబ్ధిదారులను దళిత బంధు పథకానికి అర్హులుగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బందు పథకంపై అవగాహన కల్పించారు.
లబ్ధిదారులు తీసుకున్న నగదును ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. చిన్న పరిశ్రమలు, వివిధ రకాల వ్యాపారాలు చేపట్టడానికి నగదును ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా స్థాయి అధికారులు లబ్ధిదారులకు గేదెలు, గొర్రెలు, పౌల్ట్రీ వంటి వాటిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.