కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో రాజ్వీర్ మాట్లాడారు. ఉపాధి హామీ సోషల్ ఆడిట్ 18 గ్రామాలు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 గ్రామాల ఆడిట్ నిర్వహిస్తున్నారని చెప్పారు.
గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనుల వర్క్ ఫైళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ధరణిలో వచ్చిన స్లాట్ బుకింగ్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని కోరారు.