బోధన్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశాల మేరకు శక్కర్ నగర్‌లో స్టేడియం ఏర్పాటు కోరకు శక్కర్ నగర్ ఎన్.ఎస్.ఎఫ్ క్లబ్‌ను బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, అధికారులు పరిశీలించారు.
బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్‌లో స్పోర్ట్స్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కొరకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశాల మేరకు ఎన్.ఎస్.ఎఫ్ క్లబ్‌ను మంగళవారం బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రామ లింగం, మున్సిపల్ డీఈఈ శివానందం, కోర్ కమిటీ అధికారులతో కలిసి పరిశీలించారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఎతేషాం సోహైల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధ కృష్ణ,మున్సిపల్ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, ఇంతియాజ్, డేగవత్ ధూప్ సింగ్ నాయక్, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, హమైద్, నాయకులు వల్లూరి రవి చంద్ర, కోర్ కమిటీ అధికారులు విశ్వనాథం, పెంటారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.