కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని పద్మావతి రైస్ మిల్లు ను మంగళవారం సందర్శించారు. సకాలంలో మిల్లింగ్ పూర్తిచేయాలని కోరారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ డిఎస్ఓ రాజశేఖర్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ కిష్టయ్య, రైస్ మిల్ యజమానులు ఉన్నారు.