కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలో రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పెండిరగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ధరణి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పాసుపుస్తకం నకలు పొందవచ్చని సూచించారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట ఇంచార్జ్ ఆర్డీవో రాజా గౌడ్, తాసిల్దార్ స్వామి ఉన్నారు.