బాన్సువాడ, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ తెరాస పార్టీ కార్యవర్గ ఎన్నిక సన్నాహక సభలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర సమితి జండా పండుగ సందర్బంగా రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ తెరాస పార్టీ కార్యవర్గ ఎన్నిక సన్నాహక సభ సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులుగా పాత బాలకృష్ణని, ముఖ్య కార్యదర్శిగా లింగమేశ్వర్‌ని, పట్టణ యువజన విభాగ అధ్యక్షులుగా యునుస్‌ని, మహిళ విభాగం అధ్యక్షులుగా గులిపల్లి అనితని, రైతు విభాగం అధ్యక్షులుగా ముదిరెడ్డి విటల్ రెడ్డిని, బీసీ విభాగం అధ్యక్షులుగా గొంట్యాల బాలకృష్ణని, ఎస్సి విభాగం అధ్యక్షులుగా మల్లూరి సాయిలుని, ఎస్టి విభాగం అధ్యక్షులుగా ఎన్.టి. రామారావుని, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా ఇలియాస్‌ని, మైనారిటీ విభాగం అధ్యక్షులుగా యూసుఫ్‌ని, కార్మిక విభాగం అధ్యక్షులుగా మల్లికార్జున్‌ని, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా కనుకుంట్ల సాయి కృష్ణని, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా తాటి రామ కృష్ణని, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని బాన్సువాడ పట్టణ తెరాస పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను తన ప్రాణంలా కాపాడుకుంటానని, ముందుగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ కార్యకర్తలను తన సొంత అన్న తమ్ముళ్ల, అక్క చెల్లెళ్ళ, తన ప్రాణంలా కంటికి రెప్పలా కాపాడుకుంటానని పేర్కొన్నారు.
కార్యకర్తలకు ఏ అవసరం వచ్చిన అండగా ఉంటానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రైతులకోసం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటు వంటి ఎన్నో మంచి పథకాలను మన రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ దేశానికే ఆదర్శనంగా నిలిచేలా చేస్తున్నారని తెలిపారు.
సమావేశంలో కామారెడ్డి జిల్లా రైతుబందు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలక్రిష్ణ, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రామ్ నాయక్, సొసైటీ చైర్మన్లు కృష్ణారెడ్డి, శ్రీధర్, బాన్సువాడ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్ రామ్ రెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, గురు వినయ్, పోతురెడ్డి, లక్ష్మ రెడ్డి, బాబా అలిమోద్దీన్, లింగమేశ్వర్, బాన్సువాడ పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.