కేటిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా డ్రగ్స్‌చ, గంజాయి మారుమూల ప్రాంతాల్లో కూడా విక్రయిస్తూ సాయంత్రం 6 దాటితే మత్తులో మునుగుతు చాలామంది బానిసలుగా మారుతున్నారని యువత బానిసలుగా మార వద్దని కోరుతూ వేల్పూర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయంత్రము 6 దాటితే రోడ్లపై మహిళలు, బాలికను చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో చాలా ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి నిర్మూలించాలన్న ఉద్దేశంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కేటీఆర్‌కి విశ్వేశ్వర్‌ రెడ్డికి వైట్‌ చాలెంజ్‌ విసరడం జరిగింది కానీ కేటీఆర్‌ కల్లు తాగిన కోతిలా మాట్లాడుతూ వైట్‌ చాలెంజ్‌ను స్వీకరించకుండా తన టిఆర్‌ఎస్‌ పెంపుడు కుక్కలను పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఇంటి పైకి దాడికి పంపించడం చాలా దారుణమన్నారు.

ఇందుకు నిరసనగా బుధవారం వేల్పూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి నిన్న రాజీనామాకు సిద్ధం అని మాట్లాడుతున్నారు మీరు బాల్కొండ నియోజకవర్గంలో దళితబందు తీసుకురండి లేకపోతే రాజీనామా చేయండని, ఉప ఎన్నికలు వస్తే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలతో పాటు గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడడం వల్ల తెలంగాణ అభివృద్ధి అవుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకున్నారని ఈరోజు యువత మద్యానికి గంజాయికి డ్రగ్స్‌ అలవాటు పడుతున్నారే తప్ప మరొకటి లేదని ఇప్పటికైనా యువత డ్రగ్స్‌, గంజాయి, మద్యానికి దూరంగా ఉండాలని మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు కోరారు.

కార్యక్రమంలో జిల్లా జనరల్‌ సెక్రెటరీ దామోదర్‌ గౌడ్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ నరేందర్‌, నాయకులు రాజేందర్‌, రమణ, గంగయ్య, మల్లేష్‌, భగవాన్‌ దాస్‌, శోభన్‌ రెడ్డి, గుడాల మోహన్‌, ఇంద్ర గౌడ్‌, రామ్‌ చందర్‌, బాలు, జంగన్న, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »