కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితాలో ఉన్న మృతిచెందిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఈనెల 25లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు.
ఒక కుటుంబం మొత్తం పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేవిధంగా చూడాలన్నారు. ఓటర్‌ల పేర్లు గరుడ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరిండెంట్ వరప్రసాద్, తహసీల్దార్లు పాల్గొన్నారు.