కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. వ్యాక్సినేషన్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీని సందర్శించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వర్క్ ఫైళ్లను ఈనెల 27లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తాసిల్దార్ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు తక్షణమే రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజా గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.