కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ కార్యాలయాలను హరిత కార్యాలయాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పెద్ద కొడప్గల్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో మాట్లాడారు. సమయపాలన పాటించాలని సూచించారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన తాలాబ్ తండ, లింగంపల్లి పంచాయతీ కార్యదర్శిలకు సన్మానం చేశారు. గ్రామాల్లో పైప్ లైన్ లీకేజ్ లేకుండా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. తహసిల్దార్ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజా గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.