నిజామాబాద్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవి పునరుద్ధరణ పనుల వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అటవీ పునరుద్ధరణ, బృహత్ పల్లె ప్రకృతి వనం, లేబర్ టర్నవుట్ ఎంపీడీవోస్, ఏపీఓస్, ఎంపీఓస్, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. ఫారెస్ట్ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని ఎన్ని పనులు గుర్తించారని అడిగారు.
ఎంపీడీవోలు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఫారెస్ట్ అధికారుల సూచనలు తీసుకోవాలనీ ఎస్‌ఎంసి వర్క్స్ మంచిగా జరగాలంటే సమస్యలు లేని ఏరియాను ఐడెంటిఫై చేయాలన్నారు. లేబర్ మొబి లైజేషన్‌కు ప్లాన్ చేసుకోవాలన్నారు. కూలీలకు కూలీ డబ్బులు ఆన్‌లైన్ పేమెంట్ చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో యాదాద్రి, మియా వాకింగ్ పద్ధతిలో ప్లాంటేషన్ జరగాలన్నారు.
వెదురు, టేకు పెడితే బాగుంటుందని అన్నారు. అటవీశాఖ అధికారుల టెక్నికల్ గైడ్‌లైన్స్ తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో మూడు నుండి నాలుగు వైకుంఠ ధామాలు ఉండాలన్నారు. జిపి పరిధిలో ఉన్న స్కూళ్లకు స్కావెంజర్స్ ఏర్పాటు చేసుకోవాలని, శానిటేషన్ ఇష్యూ లేకుండా చూడాలన్నారు. స్మశాన వాటికలు పెండిరగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో డిఎఫ్‌ఓ సునీల్, డిపిఓ జయసుధ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.