నిజామాబాద్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమ్‌గల్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యునిట్ 1, 2 ఆధ్వర్యంలో కళాశాల ఆవవరణలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో కలిసి ప్రోగ్రాం అధికారులు కృష్ణదాస్, ప్రిన్సిపాల్ అబ్బ చిరంజీవి మొక్కలు నాటి నీరు పోశారు.
అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల మొదటి కర్తవ్యం విద్యాభ్యాసమే కానీ భావి భారతాన్ని నిర్మించేవారు యువకులే కాబట్టి ప్రతిదేశ పురోభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ప్రముఖమైందని వివరించారు. విద్యార్థులకు సమాజ సేవతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత చాలా ముఖ్యమైందన్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకబృందం, వాలంటీర్లు పాల్గొన్నారు.