ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి లాభాల బాట పట్టించడానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని తప్పకుండా నష్టాలలో ఉన్న సంస్థను లాభాల బాటలో నడిపించడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని, కరోనా రాక ముందు ఆర్టీసీకి ఆదాయం రోజుకు రూ 14 కోట్లు వచ్చేదని, రెండుసార్లు కరోనా తర్వాత 10 కోట్లు తగ్గి 3 కోట్లు రావడం జరుగుతుందని దానివల్ల ఆర్‌టిసి కార్పొరేషన్‌ కోలుకోలేని దెబ్బ తగలడం వల్ల కార్మికులకు శాలరీ ఇచ్చే పరిస్థితి వచ్చిందని పక్క రాష్ట్రాలలో కార్మికులకు మూడు నుండి నాలుగు నెలల సాలరీ కూడా ఇవ్వలేకపోతున్నారని, మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదాయం తగ్గిన కార్మికులకు ప్రతి నెల పది రోజులు ఆలస్యమైనా శాలరీ ఇస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆర్టీసీ తొమ్మిది వేల బస్సులు నడుపుతుందని అందులో ఆరు వేల బస్సులు ఆర్టీసీ సొంతంగా, మూడు వేల బస్సులు ప్రైవేటు ఆపరేటర్లతో నడుస్తున్నవని తెలిపారు. దుబారా ఖర్చులు, ప్రయాణికులు లేకుండా ఒకే రూట్లో 4 నుండి 5 బస్సులు వెళ్లడం నష్టానికి కారణం అవుతున్నవని నిజామొబాద్‌ రీజినల్‌ పరిధిలోఉన్న డిపోల అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగిందని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు.

సిటీ బస్సులతో హైదరాబాద్‌లో దాదాపు మూడు కోట్ల నష్టం వస్తుందని, ఈ నష్టాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలో ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పల్లె వెలుగు బస్సులు ఐదు గంటలకు బయలు దేరితే కూరగాయలు తెచ్చే వారికి ఉపయోగపడుతుందని, ప్రణాళికతో బస్సులు నడుపవలసిన అవసరం చాలా ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం బడ్జెట్లో మూడు వేల కోట్ల ఆర్‌టిసికి కేటాయిస్తున్నారని అయినా నష్టం పూరించ లేకపోతే ఎట్లా అన్నారు.

ముఖ్యమంత్రి ఈ సంస్థను మూసి వేయరు, ప్రైవేటుపరం చేయరని తప్పకుండా బ్రతికించి లాభాల బాటలో పట్టిస్తారని దీనికి వారి సహకారం ఉంటుందన్నారు. నా అనుభవాన్ని జోడిరచి ఆర్టీసీని లాభాల బాటలో పట్టించి కష్టాలను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ విజి గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత జడ్పిటిసి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »