నిజాంసాగర్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు 7 వరద గేట్ల ద్వారా 59 వేల 200 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరిగిందని ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 1,2,3,6,7,11,12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
ఎగువ భాగం నుంచి ఇన్ ఫ్లో 42 వేల 300 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులో వచ్చి చేరుతుందని అన్నారు. జెన్కో గేట్ల ద్వారా 2 వేల 500 క్యూ సెక్కులను విడుదల చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 61 వేల 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా 1404.25 అడుగుల నీరు నిల్వ, 17.802 టీఎంసీలకు గాను 16.718 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతారు అదనంగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
సింగూరు ప్రాజెక్టు 3 వరద గేట్ల ఎత్తివేత
ఎగువ భాగమైన సింగూరు ప్రాజెక్టు 3 వరద గేట్ల ద్వారా 31921 క్యూసెక్కుల నీటిని దిగువ నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి విడుదల చేయడం జరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు 6,9,11 వరద గేట్ల ద్వారా 31 వేల 921 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. జెన్కో గేట్ల ద్వారా 2044 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం, మొత్తం 33 వేల 965 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.