నిజాంసాగర్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేయడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. దీనికి అనుగుణంగా చత్రి గోల్ బంగ్లా దగ్గర నీటిలో పర్యాటకులు దిగి ప్రమాదం అంచున సెల్ఫీలు దిగుతున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే గేట్ల ముందు భాగంలో అలల వద్ద పర్యాటకులు ఫోటోలు దిగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కానీ నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి ప్రమాదం అంచున దిగుతున్న సెల్ఫీ పర్యాటకులను అటువైపుగా వెళ్లకుండా చూడాలని పత్రికాముఖంగా తెలిపారు.