కామరెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన కుంచాల లక్ష్మి (80) ఆపరేషన్ నిమిత్తమై రష్ వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి 64 వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం, 15 రోజులకు ఒకసారి ప్లేట్ లెట్స్ దానము చేయవచ్చుననీ, రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి గత 14 సంవత్సరాలుగా సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు.