నిజామాబాద్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రక ృతి వ్యవసాయం చెయ్యడం అంటే దేశం యొక్క రుణం తీసుకోవడమేనని, వ్యవసాయ సంఘాలు అంటే కేవలం వ్యవసాయం ఎలా చెయ్యడమో, పండిరచిన పంటను మార్కెటింగ్ చెయ్యడం కాదు, రైతులు అన్ని విధాలుగ అభివృద్ధి చెందడం, కాని ఇక్కడ నర్సింగ్‌పల్లిలో ప్రకృతి వ్యవసాయం చెయ్యడమే కాకుండ దానికి ఆధ్యాత్మికత చేర్చడంతో లోక కళ్యాణానికి ఇక్కడే మళ్లీ బీజం పడ్డది అని ముఖ్య అతిథి అప్మాస్ అధ్యక్షులు సి.ఎస్.రెడ్డి అన్నారు.
మాగంటి రూప మాట్లాడుతూ దేశాన్ని సంస్కరించాలంటే రైతును పటిష్ట పరిస్తే చాలు అని, రైతు బావుంటే దేశం బావుంటదని, ప్రకృతి వ్యవసాయం మన భారతదేశ సంస్క ృతి అని, పాశ్చత్య దేశాలు వచ్చి అధిక దిగుబడి పేరులతో మనచే రసాయనిక ఆహారాన్ని తినిపించి దేశాన్ని, దేశ పౌరులను నాశనం చేశారని అన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రోగనిరోధక భారతదేశాన్ని నిర్మించవచ్చన్నారు.
మరొక అతిథి ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో మనుషుల మధ్యన ఉత్పన్నమవుతున్న అలజడులు కూడ మాయం అవుతాయి అని, ప్రకృతి వ్యవసాయం చేసిన వారికి ఎవరి పైన ఆధారపడవలసిన అవసరం లేదన్నారు. పంటలను రెట్టింపు ధరలు ఇచ్చి కొనడానికి వినియోగదారులు రెడీగా ఉన్నారని, ప్రకృతి వ్యవసాయం అంటే స్వయం అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి అన్నారు.
డిఎఫ్‌వో శివకుమార్ మాట్లాడుతూ ఇంత నిష్టతో క్రమశిక్షణగ నడుస్తున్న సొసైటీలు చాలా అరుదు అని పంట వేసిన నాటి నుండి పంట అమ్ముడు పోయేవరకు సొసైటీ సభ్యులు నిలబడడం గొప్ప విషయం అన్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారు కూడ చాలా క్రమశిక్షణగ ఆర్గానిక్ ఎరువులను తయారు చేసుకోవడం, అందరు సభ్యులు కలిసి కట్టుగ అందరి పొలాల్లో పని చెయ్యడం చాలా మంచి విషయమన్నారు.
ప్రముఖ నిర్మాత, మాపల్లె ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మర్స్ సర్వీస్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (ఎఫ్‌పివో) సభ్యులు దిల్ రాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా మన గ్రామస్తుల మధ్యన వచ్చిన అధ్బుతమైన ఐక్యతను చూసి చాలా సంతోషం వేసిందని, అందరు ఇప్పుడు ఏ విధంగానైతే సుఖంలో ఐక్యంగా ఉన్నామో కష్టాలు వచ్చినప్పుడు కూడ ఇలానే ఏకతాటిపై ఉండాలన్నారు.
ప్రక ృతి వ్యవసాయాన్ని తన ఊరిలో చూస్తుంటే చిన్న నాటి రోజులు గుర్తుకొచ్చాయని, దేశానికి ఉపయోగపడే కార్యం తమ ఊరినుండి మొదలవ్వడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు.
కార్యక్రమం చివరలో ఉత్తమ రైతు బృంద సభ్యులు అవార్డును సాయిలుకు, ఉత్తమ రైతు అవార్డు దినకర్‌కు, ఉత్తమ రైతు బృందంగ ఘని బృందంకు ముఖ్య అతిథుల చేతుల మీదుగ అవార్డులు అందజేశారు. మా పల్లె ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మర్స్ సర్వీస్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (ఎఫ్‌పివో) నిర్వహించిన వార్షిక మహాసభలో సొసైటీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సర్పంచ్ సాయరెడ్డి, ఎంపిటిసి రాములు, రాజేశ్వర్, నర్సారెడ్డి, మాధవ్ నగర్ సొసైటీ అధ్యక్షులు నాగేశ్వర్ రావు, రవిందర్ రావు, నరేష్, రమేష్, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.