కామారెడ్డి, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం ధర్మా రావుపేట గ్రామ పంచాయతీలో బుధవారం 7 రిజిస్టర్‌లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు. వర్క్ ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పని చేసిన చోట వర్కు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో లక్‌పతి నాయక్, ఏపీఓ శృతి, అధికారులు పాల్గొన్నారు.