నారాయణ ఖేడ్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ మండలంలోని చల్లగిద్ద తాండలో వందశాతం కరోన టీకాలు పూర్తయినట్లు నారాయణఖేడ్ ఎంపీపీ కర్ర చాందీ భాయి చౌహన్ అన్నారు. బుధవారం చల్లగిద్ద తాండలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి తుర్కపల్లి ఆస్పత్రి వైద్యులు రాజేష్‌తో కలసి సందర్శించారు.
అనంతరం మాట్లాడుతూ మండలంలో వంద శాతం కరోన వ్యాక్సిన్ వేసుకున్న మొదటి గ్రామపంచాయతి అని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వందశాతం వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ చౌహన్, గ్రామ సర్పంచ్ సుశీల చౌహన్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.