బోధన్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 20, 30 సంవత్సరాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలకు ప్రభుత్వం పట్టా పాస్ బుక్కులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం గాని, బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని 2006లో సాగు చేసుకునే భూములకు పట్టాలు ఇవ్వాలని చట్టం వచ్చినప్పటికీ, అట్టి చట్ట ప్రకారము ఇవ్వకపోవడం విచారకరమని మండిపడ్డారు.
కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. మల్లేష్, పడాల శంకర్, సిపిఎం పార్టీ నాయకులు జె. శంకర్ గౌడ్, ఏశాల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ నవీన్ కుమార్, టిటిడిపి పార్టీ నాయకులు సిహెచ్ వి హనుమంత్ రావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జూనేత్ హైమద్ కలీం, సిహెచ్ గంగయ్య, బి. సాయిలు, ఎస్ బాలయ్య, ఎస్ శంకర్, సయ్యద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.