నిజాంసాగర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో యాసంగిలో ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి అమర్ ప్రసాద్ మాట్లాడారు.
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, కుసుమ, శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, చెకు, ఆయిల్ పామ్ వంటి పంటలను పండిరచాలని రైతులకు వివరించారు. తరచుగా వరి పంట వేయడం వల్ల కలిగే నష్టాలు, ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులకు కలిగే మేలు గురించి వివరించారు.
ఆరుతడి పంటల్లో ముఖ్యంగా నూనె గింజలు పండిరచి రైతులు అధిక లాభాలు పొందే పద్దతులు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, మండల వ్యవసాయ సర్పంచ్ పిరిని అంబవ్వ, ఉప సర్పంచ్ రామా గౌడ్, టిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుభాష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.