అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళి అనే గర్భిణీకి అత్యవసరంగా చికిత్స నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అశోక్‌ రెడ్డి సహకారంతో వారికి కావాల్సిన అత్పల్పంగా లభించే బి నెగిటివ్‌ రక్తం అందజేశారు.

ఈ సందర్భంగా బోనగిరి శివకుమార్‌ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికి మానవతా దృక్పధంతో రక్తదానికి ముందుకు రావడం అభినందనీయమని, స్ఫూర్తిదాయకమని రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో వీటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషన్‌ చందన్‌ ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »