ఆర్మూర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో రైతులకు పయనిర్ కంపెనీ సిబ్బంది మొక్కజొన్నపై అవగాహన కల్పించారు. పయనీర్ కంపెనీ వారి పి3524 అనే రకం మంచి దిగుబడినిస్తుంది సమానమైన కండెలు కలిగి ఉంటుందని, ఒక్కొక్క కండెలో 18 నుంచి 22 వరసలు వస్తాయని ఈ రకం మొక్కజొన్న గాలివానలకు తట్టుకుని నిలబడి ఉంటుందని వివరించారు.
అలాగే ఇతర రకాలతో పోలిస్తే మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి ఎక్కువగా వస్తుందని మొక్కజొన్న వేసుకొని రైతులు అధిక లాభాలను గడిరచాలని వారు తెలిపారు. కార్యక్రమంలో 8 గ్రామాల నుండి రైతులు సదస్సులో పాల్గొన్నారు.
కార్యక్రమానికి 8 గ్రామాల నుండి దాదాపుగా 200కు పైగా రైతులు సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమానికి పయనిర్ కంపెనీ సిబ్బంది నిజామాబాద్ టిఎస్‌ఎం దిల్ రంజాన్, కామారెడ్డి టిఎస్‌ఎమ్ రోహన్, ఎండిఆర్‌లు జక్కా రమణయ్య, దేవిసింగ్, చిన్నారెడ్డి, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.