డిచ్‌పల్లి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయవిభాగంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా న్యాయసేవ సంస్థ కార్యదర్శి జె.విక్రమ్ న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యార్థుల పరిణతి వలన సమాజాన్ని చైతన్యపరచాలని ప్రోత్సహించారు. కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టియు న్యాయవిభాగాధిపతి డాక్టర్ స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ జె.ఎల్లోసా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ నాగజ్యోతి, ప్రదీప్, బాలరాజు, సమ్మయ్య, తదితరులున్నారు.