నారాయణఖేడ్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరకు పంటలో అంతరపంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న పొలంలో దాడి చేసి గంజాయి మొక్కలను దగ్దం చేసినట్లు నారాయణఖేడ్ ఆబ్కారీ సీఐ మహేష్ తెలిపారు. మనూర్ మండలం బాదల్ గమ గ్రామానికి చెందిన బి.సంజీవులు అనే రైతు చెరుకు పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు.
150 గంజాయి మొక్కలను గుర్తించి దగ్గం చేసినట్లు తెలిపారు. ఒక్కొక్క గంజాయి మొక్క 12 ఫీట్లు ఎత్తులో ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు 10 లక్షలు మేర ఉంటుందని తెలిపారు. భూ యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.