కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంను గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకుందని పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో పల్లె ప్రకృతి వనం దట్టంగా పెరిగిందని సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్‌కు చెప్పారు.
వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఉపాధి హామీ కింద గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సదాశివనగర్, రామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజువీర్, కార్యదర్శి సంతోష్, అధికారులు పాల్గొన్నారు.