Monthly Archives: September 2021

ఉపాధి హామీ వర్క్‌ ఫైళ్ళ పరిశీలన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని నర్సరీని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలు వృక్షాలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ వర్క్‌ ఫైళ్లను పరిశీలించారు. ఇసన్నపల్లిలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ్‌ కుమార్‌, ఎంపిఓ సవిత, ఏపీఓ ధర్మారెడ్డి, …

Read More »

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. మొక్కలకు సేంద్రియ ఎరువులు వేయాలని సూచించారు. పాఠశాల పకృతి వనంలో ఉన్న వ్యాయామ పరికరాలను పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ గ్రామంలో 100 శాతం …

Read More »

బృహత్‌ పల్లె ప్రకృతి వనం పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలో బృహత్‌ పల్లె ప్రకృతి వనంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. రైల్వే వంతెన కింద వరద నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్‌ను పరిశీలించారు. రాజంపేటలో ఊర చెరువు కట్ట కుంగిపోయింది. భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కుంగిపోయిందని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 34వ వార్డులో ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ ఆశన్న గారి జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పిఎసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ నర్మేనవీన్‌, సర్వ సమాజ్‌అధ్యక్షులు మహేష్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పండిత్‌ ప్రేమ్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ …

Read More »

భగత్‌సింగ్‌ ఆశయాలను కొనసాగిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్రోద్యమ యువ కెరటం కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా కోటగల్లీలో గల భగత్‌ సింగ్‌ విగ్రహానికి పి.డి.ఎస్‌.యు, పీవోడబ్ల్యూ, పీవైఎల్‌, ఐ.ఎఫ్‌.టీ.యు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ దోపిడీ పీడనలు …

Read More »

జిల్లాలో అత్యధిక వర్షపాతం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాలుగా కూడా ఇంత పెద్ద వర్షం జిల్లాలో కురువ లేదని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు గాని మూగజీవాలకు గాని హానికాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రహదారులు చెరువులు ఎక్కడైనా దెబ్బతింటే లేదా తెగిపోయిన వెంటనే పునరుద్ధరణ …

Read More »

చివరి క్షణంలో ప్రాణాలు కాపాడిన భీంగల్‌ పోలీసులు

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్యాస్‌ సిలిండర్‌ సప్లై చేసే వ్యక్తి తెల్లవారుజామున తన గ్యాస్‌ వాహనముతో గొనుగొప్పుల గ్రామం రోడ్డుపై వెళ్తుండగా నీటి ప్రవాహములో చిక్కుకొని ఉండగా సంఘటన స్థలానికి ఎస్‌ఐపి ప్రభాకర్‌ ఎస్‌హెచ్‌వో భీంగల్‌ చేరుకొని తన సిబ్బంది లింబాద్రి, సురేష్‌, సుధీర్‌, మధు, కిశోర్‌, గ్రామస్థుల సహకారంతో అట్టి వ్యక్తి ప్రాణం కాపాడారు.

Read More »

పరిస్థితులు అదుపులోనే…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం నుండి …

Read More »

ఆదర్శం నర్సింగ్‌పల్లి ప్రకృతి వ్యవసాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రక ృతి వ్యవసాయం చెయ్యడం అంటే దేశం యొక్క రుణం తీసుకోవడమేనని, వ్యవసాయ సంఘాలు అంటే కేవలం వ్యవసాయం ఎలా చెయ్యడమో, పండిరచిన పంటను మార్కెటింగ్‌ చెయ్యడం కాదు, రైతులు అన్ని విధాలుగ అభివృద్ధి చెందడం, కాని ఇక్కడ నర్సింగ్‌పల్లిలో ప్రకృతి వ్యవసాయం చెయ్యడమే కాకుండ దానికి ఆధ్యాత్మికత చేర్చడంతో లోక కళ్యాణానికి ఇక్కడే మళ్లీ బీజం పడ్డది …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, భరత్‌, అజయ్‌ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »