ఆర్మూర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమితి కామరెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రాంరెడ్డి మాట్లాడారు. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సోయలు, మక్క, వరి తీవ్రంగా రైతులు నష్టపోయారని, గత జూన్ నుండి ఇప్పటి వరకు రైతులు తమ దగ్గర వున్న డబ్బులు అన్ని …
Read More »Monthly Archives: September 2021
లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూకే తెలంగాణ జాగ ృతి ఆధ్వర్యంలో లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగ ృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన …
Read More »సిక్కుల కాలనీలో సమస్యల పరిష్కారం..
ఆర్మూర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం, సంతోష్ నగర్‌లో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలనీలో పేద సిక్కు కులస్థులు ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం, ఇతర వస్తువులు తడిసి నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం మున్సిపల్ కౌన్సిలర్ …
Read More »నిండుకుండలా ప్రవహిస్తున్న జన్నెపల్లి పెద్దవాగు
నవీపేట్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని జన్నెపల్లి పెద్దవాగు జలకల సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీవర్షాల కారణంగా వరదనీరు తోడవ్వడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాలనుండి వరదనీరు సైతం చేరడంతో ఇంచుమించు వంతెనకు తాకే పరిస్థితి కనిపిస్తుంది.
Read More »భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించిన సి.ఎం.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం …
Read More »జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ …
Read More »జిల్లా పోలీసు శాఖ వారి ముఖ్య సూచన
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన మరియు రానున్న రెండు, మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. …
Read More »పరీక్షలు వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసిన పరీక్షల …
Read More »సాఫ్ట్‌బాల్ విజేతలకు సన్మానం
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్ సన్మానించి అభినందించారు. ఈనెల 19 నుంచి 23 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో జరిగిన 33 వ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ జాతీయ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున సౌమ్య రాణి, రాణి, సృజన, సౌందర్యలు పాల్గొని …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట భట్టు తండాకు చెందిన సలావత్ విజయ పురిటి నొప్పులు రావడంతో రాత్రి 12 గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సలావత్ విజయ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో ఆడబిడ్డకు …
Read More »