Monthly Archives: October 2021

ఇంటర్‌ పరీక్షల్లో 1247 మంది గైర్హాజరు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఆదివారం ఐదో రోజున జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 1247 మంది గైర్హాజరు అయ్యారు. జిల్లాలోని మొత్తం 57 పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ పర్యవేక్షించి తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘు రాజ్‌ జిల్లా కేంద్రంలోని నాగారం రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల (మైనారిటీ) …

Read More »

వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్య ఉద్యమాలే శరణ్యం

బోధన్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు పాలక పార్టీలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్యఉద్యమాలు శరణ్యమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం బోధపట్టణం తాలూకా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ భవన్‌లో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసి పార్టీ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన …

Read More »

సమైక్య స్ఫూర్తికి సర్దార్‌ పటేల్‌ నిలువుటద్దం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్రానంతరం భారతదేశాన్ని సమైక్య పరిచి ఎన్నో సంస్థానాలను విలీనం చేసిన స్పూర్తి ప్రదాత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కొనియాడారు. ఆయన జయంతి రోజున జాతీయ ఏక్తా దివస్‌ నిర్వహించుకుంటున్న సంగతి విదితమే. ఆదివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. …

Read More »

రైతులకు ముఖ్య గమనిక…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రం, నిజామాబాద్‌ (రుద్రూర్‌) వారు ముందస్తు వాతావరణ సూచనలు చేశారు. రాగల నవంబర్‌ 2వ తేదీ, 3వ తేదీలలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే …

Read More »

పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నలభై సంవత్సరాలుగా సాగుచేస్తున్న పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని పట్టాలు ఇచ్చిన భూములలో ఫారెస్ట్‌ అధికారుల అడ్డంకులు తొలగించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌ నాయకత్వంలో జిల్లా బృందం వేల్పూరులో మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏఐకెఎమ్‌ఎస్‌ …

Read More »

పౌష్టికాహారం అందేలా చూడాలి….

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు పౌష్టికాహారం అందేవిధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం వీడియో కాన్ఫరెన్సులో మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని వంటశాలలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. పరిశుభ్రమైన పాత్రలలో మధ్యాహ్న భోజనం, …

Read More »

అటవీ భూముల సంరక్షణకు సహకరించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం రాజకీయ పార్టీల నాయకులతో అటవీ భూములు సంరక్షణ, పోడు వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు పోడు …

Read More »

చట్టం ముందు అందరూ సమానమే

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టం ముందు మహిళలు, పురుషులు సమానమేనని హైకోర్టు జడ్జి విజయ సేన్‌ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆజాద్‌ కా అమ ృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి చట్టాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని …

Read More »

టి.యు. ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఈ.సి. సమావేశంలో పలు విషయాలు ఆమోదించారు. ఈ. సి సభ్యుల సూచన మేరకు ప్రస్తుత రిజిస్ట్రార్‌ను మార్చి ఆచార్య యదగిరిని నియమించారు. పొరుగు సేవల ఉద్యోగులను ఎవరిని అపాయింట్‌ చేయలేదని తెలిపారు. నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు ప్రభుత్వ సూచనల మేరకు పెంపు చేయడం …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 29, 30 తేదీలలో జరగవలసిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్‌ 31 (ఆదివారం) తేదీ నవంబర్‌ 1వ తేదీన (సోమవారం) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘు రాజ్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఇది వరకే షెడ్యూల్‌ ప్రకటించిందని తెలిపారు. అక్టోబర్‌ 29, 30 తేదీలలో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31, నవంబర్‌ 1వ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »