కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రశాంత వాతావరణం లభించిందని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలోని అంబరీషుడి గుట్టపైన ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు.
వర్క్ బోర్డుని సందర్శించారు. ప్రకృతి వనంలోని మొక్కలు వృక్షాలు గా మారాయని సర్పంచ్ లలిత తెలిపారు. వాచర్ నారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సర్పంచ్ లలిత, జడ్పీ సీఈఓ సాయా గౌడ్, డిపివో సునంద, ఎంపీడీవో రాజువీర్, ఏపీఓ శృతి, అధికారులు పాల్గొన్నారు.