మొక్కలు పరిశీలించిన కేంద్ర బృందం

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జెయింట్‌ సెక్రెటరీ చరణ్‌ జిత్‌ సింగ్‌, డైరెక్టర్‌ ఆర్‌పి సింగ్‌ పరిశీలించారు. మొకరం చెరువులో జరిగిన పూడికతీత పనులను చూశారు. సారవంతమైన మట్టిని తమ పంట పొలాల్లో వేసుకోవడం వల్ల పంట దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు.

భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగినట్లు చెప్పారు. కూలీల జాబ్‌ పనులను పరిశీలించారు. గ్రామ పంచాయతీ వద్ద ఉపాధిహామీ వర్క్‌ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం కంటూర్‌ కందకాలను పరిశీలించారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గాంధారి మండలం సీతాయిపల్లిలో గొర్రెల షెడ్లను సందర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా షెడు నిర్మాణం చేసినట్లు లబ్ధిదారుడు మల్లేష్‌ తెలిపారు.

వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో చేపట్టిన పనులపై చర్చించారు. అవసరం ఉన్న వారికి జాబ్‌ కార్డులను అధికారులు అందజేస్తారని చెప్పారు. జాబ్‌ కార్డులను, పాసు పుస్తకాలను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో కూలీలు ఏం చేస్తున్నారని కేంద్ర బృందం సభ్యులు వివరాలు అడిగారు.

కుటుంబ అవసరాలకు డబ్బులను వినియోగిస్తున్నామని కూలీలు పేర్కొన్నారు. గడ్డపారలు, పావుడలు అందజేయాలని కూలీలు కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌, జెడ్పీ సీఈవో సాయి గౌడ్‌, జిల్లా పంచాయతీ అధికారిని సునంద, ఉపాధి హామీ ఏపీడిలు సాయన్న, శ్రీకాంత్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »