అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్ల తండాకు చెందిన కేతావత్‌ మమతకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి 108 అంబులెన్స్‌ సేవల కోసం ఫోను చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకుని తక్షణనమే మమత (23) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు.

రెండవ కాన్పులో మగబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించి నట్లు 108 సిబ్బంది తెలిపారు. అర్థరాత్రి సమయంలో వైద్య సేవలు అందించిన 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి అంజయ్య, పైలట్‌ రామ శంకర్‌లను ఆమె భర్త సుధాకర్‌, కుటుంబ సభ్యులు అభినందించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »