కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా చుక్క గంగారెడ్డి

జగిత్యాల, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాలకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, హక్కుల నేత చుక్క గంగారెడ్డి కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు, అవినీతి నిర్మూలన, పౌర హక్కులు, మానవ హక్కులు, స్వచ్చంద సంస్థ) తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా నియామకం అయ్యారు. గత కొంత కాలంగా చుక్క గంగారెడ్డి చేస్తున్న సమాజ సేవ, రైతు, ప్రజా సమస్యలపై, నిధుల దుర్వినియోగంపై చేస్తున్న పోరాటం, సమాచార హక్కు చట్టం వినియోగం, అవినీతి నిర్మూలన, పౌర, మానవ హక్కుల సాధనకై పోరాడుతున్న విధానాన్ని సిసిఆర్‌ సంస్థ గుర్తించింది.

వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని పలువురు సిసిఆర్‌ సంస్థ ప్రతినిధుల సూచనలు, సిఫారసు మేరకు చుక్క గంగారెడ్డిని సిసిఆర్‌ స్వచ్చంద సంస్థకు తెలంగాణ జోనల్‌ సెక్రటరీగా (ప్రెస్‌ అండ్‌ మీడియా విభాగం నుండి) నియమిస్తూ ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు మంచికట్ల అనిల్‌ కుమార్‌ 2021 సెప్టెంబర్‌ 30 గురువారం నియామక పత్రం జారీచేశారు.

సంస్థ ద్వారా తెలంగాణ జోనల్‌ లెవల్‌లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించుటకు, సంస్థ ద్వారా అధికారిక ప్రకటనలు జారీ చేయుటకు చుక్క గంగారెడ్డికి అధికారాలు అప్పగిస్తున్నట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. సిసిఆర్‌ సంస్థ ఉపాధ్యక్షులు ఇల్లెందుల స్వామి, ప్రధాన కార్యదర్శి కునవేని మహేందర్‌, సహాయ సెక్రటరీ రాజ్‌ కుమార్‌, జగిత్యాల జిల్లా కన్వీనర్‌ అయిల్నేని శ్రీనివాస్‌ రావు, ప్రతినిధులు సాయిరాజ్‌, జలందర్‌, చిన్నారెడ్డి, సతీష్‌, పాలెపు రాజశేఖర్‌, ప్రసాద్‌, సురేష్‌, పలికొండ అనిల్‌, రాజేష్‌, ప్రసాద్‌, రవీందర్‌, చంద్రమౌళి, గౌరి శంకర్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »