సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశానుసారం వివిధ కారణాల చేత అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను టిఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ పేదవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు.

బడుగు బలహీన వర్గాల వారు ఆస్పత్రులలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి ఒక్కరికి సీఎంఆర్‌ఎఫ్‌ నిధి కింద ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తున్నారన్నారు. శుక్రవారం ఏడుగురు లబ్ధిదారులు మాధురి అమ్మాయికి 40 వేలు, అనిల్‌కు 30 వేలు , బొప్పారం అనూషకు 32 వేల 500, బి రాజశేఖర్‌కు 49 వేల 500, సిహెచ్‌ గంగాధర్‌కు 25 వేలు, ఆది సురేష్‌కు 25 వేలు, జి యమునాకు 30 వేల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు అండగా ఉంటూ సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సహాయం అందించిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి, అందుకు సహకరించిన స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి, ఎంపీటీసీలు గంగాధర్‌, గంగారెడ్డి, సొసైటీ చైర్మన్‌ రాజారెడ్డి, టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరి రవి, రైతు సమన్వయ సభ్యులు ఏలేటి రమేష్‌, లింబా రెడ్డి, నచ్చన గారి గంగారెడ్డి, నడిపోల్ల గంగాధర్‌, మోర్తాడ్‌ దినేష్‌, గంగ భూమన్న, టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »