కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద ఫార్మేషన్ రోడ్డు పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్, డైరెక్టర్ ఆర్పి సింగ్ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల దూరం ఫార్మేషన్ రోడ్డు నిర్మించినట్లు రైతులు తెలిపారు.
కూరగాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఇంకుడు గుంతను చూశారు. గ్రామ పంచాయతీలో వివిధ పనులకు సంబంధించిన వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలను డబ్బులు సక్రమంగా అందుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.